కేంద్ర మంత్రిని కలిసిన జోగినాథ్ గుప్తా 

 కేంద్ర మంత్రిని కలిసిన జోగినాథ్ గుప్తా 

జోగిపేట, వెలుగు: ఆందోల్​నియోజకవర్గంలోని అల్లాదుర్గం-మెటల్ కుంట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించి పునర్నిర్మించాలని జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్ గుప్తా కేంద్ర మంత్రినితిన్ గడ్కరీని కోరారు. సోమవారం మాజీ ఎంపీ బీబీ పాటిల్ సూచన మేరకు ఢిల్లీలోని ఆయన ఆఫీసులో నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం సమర్పించారు.

తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలను కలిపే ఈ రోడ్డు గుండా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయని వివరించారు. మహారాష్ట్ర రాజధాని ముంబై ని  కూడా ఈ దారి కలుపుతుందన్నారు. జోగినాథ్ చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్న నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.