2007 T20 WC Final: హర్యానా పోలీస్ ఆఫీసర్‌తో ధోనీ

టీమిండియా మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ ఆడింది కొన్ని మ్యాచ్ లే అయినా అతని పేరు ఇండియా మొత్తం గుర్తుంటుంది. దానికి కారణం 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫైనల్‌లో పాకిస్తాన్ గెలవడానికి ఆరు బంతుల్లో 13 పరుగులు అవసరమైనప్పుడు.. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జోగిందర్ శర్మకు బౌలింగ్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. అయితే ధోనీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని జోగిందర్ నిలబెట్టుకున్నాడు. 

4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన మిస్బా ఉల్ హక్ ను ఔట్ చేసి భారత్ కు వరల్డ్ కప్ అందించాడు. ఈ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన జోగిందర్ దేశవ్యాప్తంగా ఒక్కసారిగా మారుమ్రోగిపోయాడు. వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో అతనికి స్థానం లభించలేదు. అయితే ఆయన ఇప్పుడు హర్యానాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. తాజాగా జోగిందర్ శర్మ ధోనీని కలిస్ సర్ ప్రైజ్ చేశాడు. 

ALSO READ | Paris Olympics 2024: ఓటమితోనే వీడ్కోలు.. టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్రిటన్ స్టార్

12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత హర్యానాలో జోగిందర్ శర్మ శుక్రవారం(ఆగస్టు 2) భారత మాజీ కెప్టెన్ ధోనీని కలిశాడు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో జోగీందర్ ఈ ఫోటోను షేర్ చేశాడు. "చాల కాలం తర్వాత @mahi7781ని కలవడం ఆనందంగా ఉంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలవడంతో ఈ రోజు భిన్నంగా ఉంది." అని జోగిందర్ రాసుకొచ్చాడు.