హైదరాబాద్ : బల్కంపేట కళ్యాణంలో రాతోత్సవ కార్యక్రమంలో పోతురాజులకు, శివసత్తులకు అవమానం జరిగిందని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జోగిని శ్యామల మీడియా సమావేశంలో మాట్లాడారు. రాతోత్సవంలో జోగినిలు, శివసత్తులపై లాఠీఛార్జ్ చేసి అవమానించారని ఆమె అన్నారు. మమ్మల్ని కొట్టినందుకు మేం మనస్థాపానికి గురైయ్యామని జోగిని శ్యామల చెప్పుకొచ్చారు. రాజు బాగుండాలని, రాష్టం బాగుండాలని మేము అమ్మావార్లను పూజిస్తాం.. అలాంటి మమ్మలిని అడ్డుకుంటున్నారని ఆమె తెలిపారు.
మమల్ని అవమానించి, అడ్డుకున్నందుకు ఈసారి మహంకాలి అమ్మవారికి శివసత్తులు, జోగినిలు బోనాల పండుగను చేయమని అన్నారు. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కారిస్తేనే.. మేము బోనాలు తీసుకువస్తమని తేల్చి చెప్పారు. ప్రభుత్వం దిగివచ్చి బోనాల పండుగలో మా హక్కులు మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శివసత్తులను, పోతురాజులను గౌరవించాలని, మమ్మలి గుర్తించి మాకు vip పాస్ లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అధికారికంగా జోగినిలకు, పోతురాజులకు ఓ కమిటీ నియమించాలని సూచించారు.