జోగిపేట మార్కెట్​ కమిటీ మాజీ చైర్మన్​ అరెస్ట్

జోగిపేట మార్కెట్​ కమిటీ మాజీ చైర్మన్​ అరెస్ట్
  • అన్న భూమిని కొట్టేసేందుకు ఫేక్ డాక్యుమెంట్ల తయారు
  • వాటితో రెవెన్యూ అధికారులను మోసగించినందుకు కేసు

జోగిపేట, వెలుగు: ఫేక్ డాక్యుమెంట్లతో అధికారులను తప్పుదోవ పట్టించిన జోగిపేట మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్​ అరెస్ట్ అయ్యాడు. శుక్రవారం జోగిపేట ఎస్ఐ పాండు తెలిపిన వివరాల మేరకు.. జోగిపేట మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్​డీబీ నాగభూషణం సొంత అన్న బుడాల రాములుకు జోగిపేటలో సర్వేనంబర్​217, 218లో  రెండు ఎకరాల11 గుంటల వ్యవసాయ భూమి  ఉంది. రాములు గతేడాది సెప్టెంబర్​15న చనిపోయాడు. అన్న భూమిని కాజేసేందుకు నాగభూషణం ప్లాన్ చేశారు. గత ఏప్రిల్1న పట్టాపాస్​ బుక్​లో మార్పు కోరుతూ ధరణి పోర్టల్​లో అప్లై చేశాడు. 

తహసీల్దార్ ఫోన్​చేసి ఒరిజినల్ పట్టా కాపీ అందజేయాలని​ సూచించారు. దీంతో నాగభూషణం పరిచయస్తుడైన ప్రొఫెసర్ ​శ్రీకాంత్ ​పేరిట గెజిటెడ్ సంతకం, స్టాంప్ ఫోర్జరీతో ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి తహసీల్దార్​కు అందజేశాడు. దీనిపై విచారణ చేయగా ఫేక్ డాక్యుమెంట్ అని తేలాయి. దీంతో అందోల్ డిప్యూటీ తహసీల్దార్ మధుకర్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి డీబీ నాగభూషణంను అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు