
జోగిపేట,వెలుగు : జోగిపేట మున్సిపాల్టీ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, కౌన్సిలర్ సుమిత్ర, చేనేతసహకార సంఘం మాజీ చైర్మన్ సత్యం, మార్క్‌ఫెడ్ డైరెక్టర్జగన్మోహన్రెడ్డి శనివారం మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ..అందరూ కలిసి పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థి సురేశ్శెట్కార్ను గెలిపించాలన సూచించారు.
కాంగ్రెస్‌లో చేరిన జడ్పీటీసీ, మాజీ డీసీఎంఎస్ చైర్మన్
రాయికోడ్: జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్‌పాటిల్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిద్దన్నపాటిల్, మండలబీఆర్ఎస్అధ్యక్షుడు బస్వరాజ్‌పాటిల్, మాజీ సర్పంచులు సంగమేశ్వర్‌పాటిల్, శంకర్‌ముదిరాజ్, యాదయ్య, వినయ్ కుమార్, సంతోష్ కుమార్ పాటిల్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో జాయిన్అయ్యారు. శనివారం మంత్రి దామోదర రాజనర్సింహ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.