
జోగిపేట, వెలుగు: అమరవీరులు సుఖ్‌దేవ్, భగత్‌సింగ్, రాజ్‌గురు వర్థంతి సందర్భంగా జోగిపేట పొలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పీఎస్‌లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆందోల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 70 యువకులు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ పాండు మాట్లాడుతూ..మనం ఇచ్చే రక్తం మరొకరి ప్రాణాలు కాపాడుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ముందుగా ఎస్ఐ పాండు ర క్త దానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.