ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణాభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
పట్టణవాసుల ఇబ్బందులను పరిష్కరించడం, స్థానికంగా మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు. నిధుల నిలిపివేతతో పనులు ఆగిపోతాయని, ప్రజలకు తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు.