ఆదిలాబాద్, వెలుగు: లక్ష్యానికి అనుగుణంగా యువత కష్టపడితే విజయ తీరాలకు చేరవచ్చని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. అగ్నిపథ్‌లో జవాన్లుగా ఎంపికైన కొండ్ర అనిల్, శివ శంకర్ రెడ్డి, ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికైన ఓరుగంటి పృథ్వీరాజ్‌ను ఆయన ఆదివారం సన్మానించారు.
ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో 13 పథకాలు సాధించి.. ఓవరాల్ ఛాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్న క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో స్విమ్మింగ్ కోచ్ కొమ్ము కృష్ణ, రాకేశ్, వినోద్, దాస్, పీఈటీ స్వామి తదితరులు పాల్గొన్నారు.