ఆదిలాబాద్లో జొన్నల కొనుగోళ్లు ప్రారంభం

ఆదిలాబాద్: కాంగ్రెస్, బీజేపీ నాయకులు రైతులతో రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే జోగురామన్న మండిపడ్డారు. ధాన్యం కొనకుండ కేంద్రం రైతులను ఆగం చేస్తుందని చెప్పారు. క్వింటాలు జొన్నలకు ప్రభుత్వం 2738 రూపాయల మద్దతు ధర ఇచ్చిందన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోళ్లు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే జోగు రామన్న. ఎన్ని కష్టాలు వచ్చినా.. కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నా .. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.