
గండీడ్, వెలుగు: మహమ్మదాబాద్ మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన జోగు వైష్ణవి బాక్సింగ్ పోటీల్లో వెండి పతకం సాధించింది. సౌత్ జోన్ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీల్లో భాగంగా ఈ నెల 10 నుంచి 12 వరకు పుదుచ్చేరిలో జరిగిన సబ్ జూనియర్ పోటీల్లో 35, 37 కేజీల విభాగంలో వైష్ణవి సిల్వర్ మెడల్ సాధించింది. వైష్ణవి ప్రస్తుతం నార్సింగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. వైష్ణవిని టీచర్లు, గ్రామస్తులు అభినందించారు.