అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సెలవు దినంతో పాటు కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని గణపతి పూజ, శివాలయంలో అభిషేకాలు, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తుంగభద్ర నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.