అలంపూర్‌‌లో ఘనంగాజోగులాంబ బ్రహ్మోత్సవాలు

అలంపూర్‌‌లో ఘనంగాజోగులాంబ బ్రహ్మోత్సవాలు

అలంపూర్, వెలుగు: జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం విశేష అర్చనలు, చండీహోమం, పవమాన సూక్త పారాయణం, ఆవాహిత దేవతాహోమం, మండపారాధన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పం నిర్వహించా రు. సోమవారం వసంత పంచమి సందర్భంగా మహా పూర్ణాహుతి, అమ్మవారి ఆలయ యాగశాలలో నిత్యహోమం, కలశ ఉద్వాసన, అమ్మవారి మూలమూర్తికి అవబృదస్నపనం, పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. 

భక్తులకు అమ్మవారి నిజరూప దర్శనం, సహస్ర ఘటాభిషేకం, సాయంత్రం జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు శాంతి కల్యాణోత్సవం నిర్వ హించనున్నారు. ధ్వజారోహణతో ఉత్సవాలు ముగియనున్నాయి. వసంత పంచమి సందర్భంగా అమ్మవారు నిజరూపంలో దర్శనం ఇవ్వనుండగా, మహిళలు వెయ్యి కళశాలతో అమ్మవారిని అభిషేకిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో పురేందర్ కుమార్ తెలిపారు.