జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆదాయం రూ.72.95 లక్షలు

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆదాయం రూ.72.95 లక్షలు

అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామికి సంబంధించిన 106 రోజుల ఆదాయం రూ.72.95 లక్షలు వచ్చినట్లు ఈవో పురేందర్​కుమార్​ తెలిపారు. బుధవారం హుండీల లెక్కింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. అమ్మవారి హుండీ ద్వారా రూ.60.76 లక్షలు, స్వామి వారి హుండీ ద్వారా రూ.11.79 లక్షలు, అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.38,889 సమకూరినట్లు చెప్పారు. యూఎస్​ డాలర్లు 14, మలేషియా రింగిట్ 7, మిశ్రమ బంగారం 56 గ్రాములు, మిశ్రమ వెండి 222 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు.