జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానములో .. హుండీ ఆదాయం రూ. 32 లక్షలు

అలంపూర్, వెలుగు: శ్రీ  జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి  దేవస్థానములో 55 రోజుల హుండీని బుధవారం  లెక్కించారు.  మొత్తం  రూ.32,02,163 లక్షలు  సమకూరినట్లు ఈవో పురేందర్ కుమార్ తెలిపారు.  స్వామి వారికి రూ. 12,05,749 లక్షలు,  అమ్మవారి హుండీ ఆదాయం రూ. 19,73,191 లక్షల హుండీ ఆదాయం వచ్చింది. మిశ్రమ బంగారు 29  గ్రాముల500 మిల్లీ గ్రాములు  రాగా మిశ్రమ వెండి 189 గ్రాముల700 మిల్లీ గ్రాములు వచ్చింది. యూఎస్ఏ  డాలర్లు కూడా  వచ్చినట్లు ఈవో తెలిపారు.   హుండీ లెక్కింపులో అధికారులు ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 మద్దిమడుగు హుండీ లెక్కింపు ..

అమ్రాబాద్, వెలుగు: మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం  హుండీ లెక్కించారు. 45 రోజులకు గాను రూ. 11 లక్షల నగదు, కేజిన్నర మిశ్రమ వెండి వచ్చినట్లు ఈవో రంగాచారి,  సర్పంచ్ అంజమ్మ, తెలిపారు.  కార్యక్రమంలో చైర్మన్  సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.