జోగులాంబ టెంపుల్ డెవలప్మెంట్​పై త్వరలో తుది నిర్ణయం : చిన్నారెడ్డి

జోగులాంబ టెంపుల్ డెవలప్మెంట్​పై త్వరలో తుది నిర్ణయం : చిన్నారెడ్డి
  • ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీల సమీక్ష


గద్వాల, వెలుగు : ఐదో శక్తి పీఠం బాల బ్రహ్మేశ్వరి జోగులాంబ అమ్మవారి టెంపుల్ డెవలప్మెంట్ పై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. మంగళవారం ప్రజాభవన్ లో జోగులాంబ ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ జోగులాంబ ఆలయ డెవలప్మెంట్ కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ కమిషనర్ శ్రీధర్, ఆలయ కమిటీతో ఇప్పటికే రెండుసార్లు సమీక్షాసమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు.

వచ్చే 20వ తేదీన మరోసారి సమావేశం నిర్వహించి ఆలయ డెవలప్మెంట్ పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.  ఆలయ ప్రాంగణంలో లైటింగ్, పార్కింగ్ పనులు చేపట్టాలని, ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని కమిటీకి ఆదేశించడం జరిగిందన్నారు. బోటింగ్, టూరిజం డెవలప్మెంట్, అతిథి గృహాల నిర్మాణాలు, ఆర్చీల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ భేటీలో అగ్రికల్చర్ విశ్వవిద్యాలయ రిటైర్డ్ వైస్ ఛాన్స్ లర్​,  ప్రొఫెసర్ రాఘవరెడ్డి రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సీడ్స్ సంఘం అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.