సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్టుల వేడుకలో హాలీవుడ్ నటుడు, డబ్ల్యూడబ్ల్యూ రెజ్లర్ జాన్ సీనా నగ్నంగా కనిపించి అందిరికీ షాకిచ్చాడు. అస్కార్ విజేతను ప్రకటించేందుకు స్టేజీ పైకి వచ్చిన జాన్ సీనాను చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. అతను స్టేజ్ పైకి ఒంటిపై బట్టలు లేకుండా.. నగ్నంగా వచ్చాడు. అందరూ సెలబ్రేషన్ మూడ్ లో ఉండగా.. జాన్ సీనా నగ్నంగా కనిపించడంతో మొదట అవాక్కైనా.. తర్వాత అందరూ పగలబడి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
2024, మార్చి 11వ తేది సోమవారం 96వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలు కేటగిరీల్లో విజేతలను ప్రకటించారు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్స్ విభాగంలో 'పూర్ థింగ్స్' సినిమాను ఆస్కార్ వరించింది. ఈ క్రమంలో విజేతను ప్రకటించేందుకు బట్టలు లేకుండా ఎన్విలాప్ కవర్‌ను అడ్డం పెట్టుకుని జాన్ సీనా స్టేజ్ మీదకి వచ్చి నిలబడ్డాడు. దీంతో అక్కడున్నవారంతా జాన్ సీనాను చూసి నవ్వుకున్నారు. అయితే, వెంటనే పక్కనున్న యాంకర్ విజేతను ప్రకటించి అందరినీ బతికించాడు. లేకుంటే ఆ ఎన్విలాప్ ఓపెన్ చేసి జాన్ సీనా విజేతను ప్రకటించాల్సి వచ్చేది. మగాడి శరీరం కూడా జోక్ ఏం కాదని, కాస్ట్యూమ్స్ కూడా చాలా ముఖ్యమని చెప్పేందుకే ఇలా వచ్చానని జాన్ సీనా చెప్పాడు.
John cena started walking naked 💀#JohnCena ||#Oscars pic.twitter.com/Ny2aqgCCJD
— Abdul Sammad Sudais (@SardarsudaisKh1) March 11, 2024