
కన్నడ స్టార్ హీరో యష్ త్వరలో 'టాక్సిక్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇది అతని కెరిర్లో 19వ సినిమాగా తెరకెక్కుతోంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా భాషలలో విడుదల కానుంది.
ఈ ఏడాది (2025) చివర్లో రానున్న ఈ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమాకు ప్రఖ్యాత హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్ జెజె పెర్రీ టాక్సిక్ కోసం పనిచేశారు.
లేటెస్ట్గా (మార్చి 13న) తనకి సంబంధించిన యాక్షన్ పార్ట్ కంప్లీట్ అయినట్లు జెజె పెర్రీ (JJ Perry) ఇన్స్టా వేదికగా తెలిపారు. ఈ మేరకు హీరో యష్తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
Also Read:-ఆహా ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
"Toxicసినిమాలో నా స్నేహితుడు యష్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది! భారతదేశంలో గొప్పగా నటించే నటుల్లో యష్ ఒకరు. యూరప్ అంతటా ఉన్న స్టార్ హీరోలతో కలిసి పని చేయగలిగాను. ఇపుడు యష్తో కూడా చేసే అవకాశం వచ్చింది. అందరూ టాక్సిక్ చూసే వరకు వేచి ఉండలేను. సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది! మేము చేసిన స్టంట్స్ పై చాలా నమ్మకంగా ఉన్నాం. అంతేకాకుండా గర్వంగా కూడా ఉంది" అని పెర్రీ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ అండ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జెజె పెర్రీ విషయానికి వస్తే.. జాన్ విక్, ఫాస్ట్ & ఫ్యూరియస్, అవతార్ 2, జెమిని మ్యాన్ మరియు ట్రాన్స్‌ఫార్మర్స్ 5 వంటి అనేక యాక్షన్ ఫిల్మ్ ఫ్రాంచైజీలలో పనిచేసిన స్టంట్ కోఆర్డినేటర్ ఇతను. ఇపుడు ఈ టాక్సిక్ కోసం పనిచేస్తుండటంతో మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఇటీవలే యష్ బర్త్డే స్పెషల్గా 'టాక్సిక్ బర్త్‌డే పీక్' పేరుతో వీడియో రిలీజ్ చేశారు. అందులో పాతకాలం నాటి కారులోంచి యష్ దిగి.. క్యాప్ పెట్టుకొని నిలబడి స్టైలిష్గా సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పబ్ లోకి వెళ్తూ.. మత్తులో చిల్ అవుతున్న ఓ అమ్మాయిపై బీర్ పోస్తూ రొమాన్స్ చేస్తాడు. అపుడొచ్చే యష్ లుక్స్ సినిమాపై ఆసక్తి కలిగించాయి.
'కేజీఎఫ్' తరహాలోనే ఇందులో కూడా యష్ పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు అర్ధమవుతోంది. అయితే, ఈ మూవీ గోవాలో ఉన్న డ్రగ్ కార్టెల్ చుట్టూ నడిచే 'యాక్షన్-ప్యాక్డ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో' తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇది 1950ల నుంచి 1970ల మధ్య కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కనుంది. అందుకు తగ్గట్టుగానే సెట్స్ డిజైన్ రిలీజ్ చేసిన పోస్టర్స్, విజువల్స్లో కనిపిస్తున్నాయి.