కొరియోగ్రాఫర్ జానీ లైంగిక వేధింపుల కేసు వ్యవహారం వరుస ట్విస్టులతో సాగుతోంది. తాజాగా మరో కొత్త ట్విస్ట్ మొదలైంది. ఫిర్యాదు చేసిన బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ భార్య సుమలత కంప్లైంట్ చేసింది.
"ఇండస్ట్రీలో ఎదగడానికి కొరియోగ్రాఫర్గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని.. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించిందని ఫిర్యాదులో సుమలత తెలిపింది.
అంతేకాకుండా.. నా భర్త జానీను ఇంటికి రాకుండా అడ్డుకునేదని కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేదని.. నాకు అమ్మ నాన్నలు వద్దు..నువ్వు పెళ్లి చేసుకో చాలు అంటూ జానీ పై తీవ్ర ఒత్తిడికి గురిచేసిందని ఫిర్యాదులో వెల్లడించింది. దీంతో నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని సుమలత అన్నారు. ఇక చేసేదేం లేక బాధితురాలు ఇంటికి వెళ్లి జానీను నువ్వు ఇష్టపడితే.. ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతానని కూడా చెప్పానని.. కానీ, బాధితురాలు మాత్రం కొరియోగ్రాఫర్ జానీ నాకు అన్నయ్య లాంటివాడు మీరు నాకు వదిన అంటూ నమ్మించిందని వెల్లడించింది.
అలాగే.. బాధితురాలు కేవలం నా భర్తతో మాత్రమే కాకుండా చాలామంది మగవాళ్ళతో కూడా అక్రమ సంబంధం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. అలా ఇవన్నీ జానీ దృష్టికి రావడంతో ఆ అమ్మాయిని దూరం పెట్టాడని.. దీంతో కక్ష కట్టి తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టిందని వివరించింది.
ఇండస్ట్రీలో పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురిచేస్తుందని.. తక్షణమే బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి చేస్తున్నాను. మాకేం జరిగినా తల్లి కూతుళ్ళదే బాధ్యత అని.. నాకు నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నానని" జానీ భార్య సుమలత ఫిర్యాదులో చెప్పుకొచ్చింది. ఈ ఫిర్యాదుతో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలాంటి చర్యలు తీసుకోనుందో తెలియాల్సి ఉంది.