జాన్సన్ బేబీ పౌడర్ల డబ్బాలు వెనక్కి

జాన్సన్ బేబీ పౌడర్ల డబ్బాలు వెనక్కి

వాషింగ్టన్ : అమెరికా మార్కెట్ నుంచి 33 వేల బేబీ పౌడర్ బాటిళ్లను జాన్సన్ అండ్ జాన్సన్ రీకాల్ చేస్తోంది. ఆన్‌‌లైన్‌‌లో కొన్న బాటిళ్ల శాంపుల్స్‌‌లో ఆస్‌‌బెస్టాస్ అవశేషాలు ఉన్నట్టు హెల్త్ రెగ్యులేటరీ గుర్తించడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వార్తల నేపథ్యంలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ షేర్లు అంతర్జాతీయ మార్కెట్‌‌లో 6 శాతానికి పైగా పడిపోయి 127.70 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. అమెరికా రెగ్యులేటర్స్ తొలిసారి ఈ ప్రొడక్ట్‌‌లో ఆస్‌‌బెస్టాస్ ఉన్నట్టు ప్రకటించాయి.

కంపెనీ కూడా తొలిసారి తన ఐకానిక్ బేబీ పౌడర్​ను రీకాల్ చేస్తోంది. ఇప్పటికే జాన్సన్ అండ్ జాన్సన్‌‌పై పలు ప్రొడక్ట్‌‌ల విషయంలో వేల కొద్దీ న్యాయ వివాదాలు ఉన్నాయి. దీని మెడికల్ డివైజ్‌‌లు, బేబీ పౌడర్ వంటివి ఆరోగ్యానికి మంచివి కావంటూ ఆరోపణలున్నాయి. జాన్సన్ బేబీ పౌడర్ లాంటి ఉత్పత్తులను వాడటం వల్ల క్యాన్సర్ వస్తోందని కన్జూమర్లు 15వేలకు పైగా ఫిర్యాదులు దాఖలు చేశారు.