ఖానాపూర్, వెలుగు: ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశమిస్తే ఖానాపూర్ నియోజకవర్గ గ్రామాల రూపురేఖలు మారుస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అన్నారు. ఆదివారం ఆయన సిరికొండ మండలం లక్కంపూర్, రాజంపేట తిమ్మాపూర్, వాయిపేట, ఫకీర్ నాయక్ తండా, ధర్మసాగర్ లెండిగూడ, సత్మురి గ్రామాల్లో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలతో మాట్లాడారు. గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం ఓ ప్రణాళిక రూపొందించుకున్నానని, ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలల్లో నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల రూపురేఖలను పూర్తిగా మార్చి చూపిస్తానని పేర్కొన్నారు.
సిరికొండ మండలంలో సీసీ రోడ్లతోపాటు విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని కానీ, ప్రతిపక్షాలు మాత్రం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
జాన్సన్ నాయక్‌కు మద్దతివ్వండి..
బీఆర్ఎస్అభ్యర్థి జాన్సన్ నాయక్‌కు ఓటేసి మద్దతు ఇవ్వాలని పార్టీ నాయకులు ప్రజలను కోరారు. అదివారం ఖానాపూర్ పట్టణంతో పాటు పెంబి, కడెం, దస్తురాబాద్ మండలాల్లో జాన్సన్ నాయక్‌కు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖానాపూర్ పట్టణంలో వాకర్స్‌ను కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రచార కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ రాజేందర్, నాయకులు రాము నాయక్, ప్రదీప్, గంగా నర్సయ్య, నాగరాజు, చింతపండు శ్రీనివాస్, రవి, వెంకట్ మహేంద్ర, సుమిత్ తదితరులు పాల్గొన్నారు.