జన్నారంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిక

జన్నారం,వెలుగు: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.  వారిలో దేవునిగూడ బీజేపీ ఇన్​చార్జి సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్  లీడర్​ లోతొర్రె మాజీ సర్పంచ్ నర్సింగరావు, బంజార సంఘం మండల ప్రెసిడెంట్ అజ్మీర బీంలాల్ నాయక్ తో పాటు   మరో 20 మంది కాంగ్రెస్​ కండువాలు కప్పుకున్నారు.   కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, పార్టీ సీనియర్ నాయకులు రాజశేఖర్,సయ్యద్ ఇసాక్ తదితరులున్నారు.