మధిర, వెలుగు : మధిర పట్టణంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీతారామచంద్ర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ పల్లపోతు ప్రసాద్ రావు 20 కుటుంబాలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి సతీమణి, అమ్మ పౌండేషన్ చైర్మన్ మల్లు నందిని సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నందిని కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో పబ్బతి రమేశ్, జంగాల మురళి, కేతేపల్లి ఉపేందర్, ఆత్మకూరు చంద్ర శేఖర్, కేతపల్లి సరోజ, మిట్టపల్లి సీతారాములు, కతరొజు రాజబ్రహ్మం, కె.రామారావు, లక్ష్మణ్, నవీన్, వంశి, పి.కార్తీక్, కొత్తూరు రమేశ్, ఎండీ నజీర్, బింగి వసంత్ కుమార్, కె.సుధాకర్, కె.శ్యాంప్రసాద్ తదితరులు ఉన్నారు.