ముథోల్​ నియోజకవర్గంలో...బీఆర్ఎస్ ​నుంచి కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు

భైంసా, వెలుగు :  ముథోల్​ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్​ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే నారాయణ్​రావు పటేల్ సమక్షంలో తానూర్​ ఎంపీపీ మంజుల యాదవ్, వైస్​ఎంపీపీ చంద్రకాంత్​ యాదవ్​తో పాటు కోఆప్షన్​ సభ్యులు, నలుగురు ఎంపీటీసీలు, 8 మంది సర్పంచులు కాంగ్రెస్​లో చేరారు. కుభీర్​ మండలంలోని కుప్టి, రంజని గ్రామాలకు చెందిన 150 మందికి పైగా బీఆర్ఎస్​ కార్యకర్తలు కాంగ్రెస్ ​కండువా కప్పుకున్నారు.

నారాయణ్​రావు పటేల్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం రేవంత్​ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్​ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాంచందర్​రెడ్డి, లీడర్లు ఓం ప్రకాశ్​లడ్డా, శంకర్​చంద్రే పాల్గొన్నారు.