శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న : మేయర్‌ గద్వాల విజయలక్ష్మి

శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న  : మేయర్‌ గద్వాల విజయలక్ష్మి

మార్చి 30వ తేదీ శనివారం రోజున కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఉదయం 10 గంటల సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి, దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా వెల్లడించారు. ఆమెతో పాటుగా ఆమె తండ్రి కేశవరావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 

అధికార పార్టీ కాంగ్రెస్​లో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు  గద్వాల విజయలక్ష్మి.  అధికారులు కూడా సహకరిస్తరు లేకపోతే డెవలప్​మెంట్ కష్టమవుతది. పది రోజులుగా పార్టీ మార్పుపై చాలా మందితో చర్చించానన్నారు. ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాన్నట్లుగా స్పష్టం చేశారు. విజయలక్ష్మితో పాటు కొంత మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్​లోచేరుతున్నట్టు తెలుస్తున్నది.

మరోవైపు బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని కేశవరావు కొడుకు విప్లవ్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీ మార్పు విషయంలో తన తండ్రి కేశవరావు, సోదరి విజయలక్ష్మితో తనకు సంబంధం లేదన్నారు.  కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న తన తండ్రి కే కేశవరావు నిర్ణయం బాధించిందన్నారు. ‘గతంలో పొన్నాల లక్ష్మయ్య వయసు గురించి సీఎం రేవంత్ విమర్శించారు. మరి 84 ఏళ్ల కేకేను ఎలా పార్టీలో చేర్చుకుంటారు? మేయర్ విజయలక్ష్మి ఒత్తిడితోనే కేకే పార్టీ మారుతున్నారు. ఆయన ఇప్పటికైనా పునరాలోచన చేయాలి. విజయలక్ష్మి బీఆర్ఎస్‌కు తీరని ద్రోహం చేశారు’ అని ఆయన మండిపడ్డారు.