ఎల్లారెడ్డి, వెలుగు : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం బీఆర్ఎస్ కౌన్సిలర్ విజయలక్ష్మి, సాతెల్లి మాజీ సర్పంచ్ సంగయ్య , మున్సిపల్ కో ఆప్షన్ షరీఫ్ లకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో పార్టీ లో చేరారు.
వీరికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, నాయకులు చెన్న లక్ష్మణ్, గయాజోద్దీన్ , మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా, పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్, గఫర్, తిరుపతి, హజార్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.