గోదావరిఖని, వెలుగు : ఉమ్మడి జిల్లాలో శనివారం కాంగ్రెస్‌పార్టీలో జోరుగా చేరికలు జరిగాయి. గోదావరిఖనిలో బీఆర్‌ఎస్ సీనియర్ లీడర్లు దీటి బాలరాజు, ఉల్లెంగుల రమేశ్, ప్రభాకర్, కృష్ణస్వామి, కుమార్, ఖాదీర్ కాంగ్రెస్‌లో చేరగా వారికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీబీజీకేఎస్ లీడర్ ఐ.రాజేశం, బెంద్రం రాజిరెడ్డి, కల్వల రమేశ్, కె.మల్లయ్యతో పాటు వంద మంది కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో 30 మంది అడ్వకేట్లు శనివారం కాంగ్రెస్‌లో చేరారు.
సుల్తానాబాద్ : ప్రజాప్రతినిధులు ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నారని పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి సిహెచ్. విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం కోదురుపాక సర్పంచ్ దేవరనేని సాగర్ రావు, వార్డ్ మెంబర్ చంద్రయ్య, ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రావు, గ్రామ అధ్యక్షుడు భాస్కర్‌రావు, సుల్తానాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ లీడర్ మాజీద్ పాషతోపాటు పెద్ద సంఖ్యలో యువకులు శనివారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.
లంబాడిపల్లిలో..
మల్యాల : మల్యాల మండలం లంబాడిపల్లి సర్పంచ్ కట్కూరి తిరుపతి, బీఆర్ఎస్లీడర్ముత్యాల నర్సింహారెడ్డితోపాటు 30 మంది వివిధ పార్టీ, కుల సంఘాల నాయకులు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
రాయికల్ : రాయికల్ మండలం రామాజీపేట, కట్కాపూర్, దావన్‌పెల్లి గ్రామాలకు చెందిన పలువురు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మంది ఆదివాసీ గిరిజనులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గంగాధర : గంగాధర మాజీ జడ్పీటీసీ సత్తు కనుకయ్య, గోపాల్రావుపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోల అంజయ్య ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్‌లో చేరారు.