ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

కాగజ్ నగర్, వెలుగు : పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్​ ప్రజాప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందని అదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. కౌటాల మండలం ముత్యం పేట్ మాజీ ఎంపీటీసీ దోని సురేఖ–రవి దంపతులు బీఆర్ఎస్​ను వీడి సోమవారం కాంగ్రెస్​లో చేరారు. వారితోపాటు దాదాపు వంద మంది కాంగ్రెస్​లో చేరగా దండే విఠల్ వారికి​ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

విఠల్ మాట్లాడుతూ పేదప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని.. త్వరలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కౌటాల, చింతలమానేపల్లి మాజీ ఎంపీపీలు బసర్కర్ విశ్వనాథ్, డుబ్బుల నానయ్య, టీపీసీసీ సభ్యుడు అర్షద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవార్ధన్ తదితరులు పాల్గొన్నారు.