చొప్పదండి, వెలుగు : చొప్పదండి మండలంలోని దేశాయిపేట ఎంపీటీసీ కూకట్ల తిరుపతి, మాజీ సర్పంచ్ కనుకం జక్కన్న, రాగంపేట మాజీ సర్పంచ్ జేరిపోతుల వెంకటయ్య, రామడుగు మండలం రంగసాయిపల్లె సర్పంచ్ సాదు పద్మతో పాటు పలువురు బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతి, సర్పంచి సత్యప్రసన్న, రాజేశం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
మల్యాల, వెలుగు : మండల బీజేపీ నాయకుడు, బీజేవైఎం ఉపాధ్యక్షుడు కుక్కల మధు బుధవారం కాంగ్రెస్ లో చేరారు. చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం పార్టీ కండువా కప్పి మధును పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆదిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, వంశీ, శంకర్ గౌడ్,పాల్గొన్నారు