కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు

రఘునాథపల్లి/ బచ్చన్నపేట, వెలుగు : కాంగ్రెస్​పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతున్నది. శనివారం జనగామ జిల్లా రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల పరిధిలోని పలుగ్రామాలకు చెందిన బీఆర్​ఎస్​నాయకులు, మాజీ సర్పంచ్​లు, ఎంపీటీసీలు కాంగ్రెస్​లో చేరారు.

రఘునాథపల్లి మండల వాసులు మాజీ జడ్పీటీసీ మారుజోడు రాంబాబు ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో, బచ్చన్నపేట మండల వాసులు జిల్లా కాంగ్రెస్​పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​కండువాలు కప్పుకొన్నారు.