దేశంలోని 21 ఐఐటీల్లో 2024-–25 విద్యా సంవత్సరంలో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ -పీహెచ్‌డీ (డ్యూయల్ డిగ్రీ) కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2024) నోటిఫికేషన్ విడుదలైంది.
సీట్ల వివరాలు: మొత్తం మూడు వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం, గణితం, భౌతికశాస్త్రంలో 105 సీట్లను జామ్ ర్యాంకు ఆధారంగా కేటాయిస్తారు. ఐఐటీ తిరుపతిలో ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, ఎమ్మెస్సీ గణితం- స్టాటిస్టిక్స్, ఎంఏ గణితం- స్టాటిస్టిక్స్‌లో మొత్తం 60 సీట్లున్నాయి.
ఎగ్జామ్ ప్యాటర్న్: జామ్ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. వ్యవధి 3 గంటలు. ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఏ సబ్జెక్టు ప్రశ్నపత్రంలోనైనా మొత్తం ఆబ్జెక్టివ్ 60 ప్రశ్నలు. వంద మార్కులు. మూడు విభాగాల్లో (మల్టిపుల్ ఛాయిస్, మల్టిపుల్ సెలెక్ట్, న్యూమరికల్) ప్రశ్నలు అడుగుతారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష 11 ఫిబ్రవరి 2024లో నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.jam.iitm.ac.in వెబ్సైట్ లో సంప్రదించాలి.