- మంత్రి సీతక్క
ఆసిఫాబాద్, వెలుగు: వట్టి వాగు రిజర్వాయర్ రక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. సింగరేణి నిధులు రూ.11.24 కోట్లతో చేపట్టనున్న వట్టి వాగు ప్రాజెక్ట్ రక్షణ కట్ట నిర్మాణానికి కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి బుధవారం రాత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వట్టివాగు రిజర్వాయర్ రక్షణ కోసం కట్ట నిర్మించేందుకు సింగరేణి సంస్థ సమన్వయంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కట్ట నిర్మాణానికి సింగరేణి నిధులు అందించడం సంతోషంగా ఉందని, ఆయకట్టు రైతులకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.