బీఆర్​ఎస్​తోనే అభివృద్ధి సాధ్యం : తాతా మధు

భద్రాచలం, వెలుగు :  రాష్ట్రంలో బీఆర్​ఎస్​తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ రంగానికి పెద్ద పీట వేసి అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తున్న కేసీఆర్​ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరారు. అనంతరం సీఐటీయూ కార్మిక సంఘం మాజీ నేత కాపుల సూరిబాబు ఆధ్వర్యంలో పలువురు కార్మికులు బీఆర్​ఎస్​లో చేరారు.