హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులు ఈనెల 9వ తేదీన ఉమ్మడిగా సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ సమాచారం ఇచ్చింది. జాయింట్ మీటింగ్ లో గెజిట్ లోని అంశాల అమలుపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.
కృష్ణా నది, గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాక గత జులై 15వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయాన్ని ఏపీ స్వాగతించగా.. తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఈ నేపధ్యంలో గత నెల 28వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రెండు బోర్డుల ఛైర్మన్లకు లేఖ రాశారు. గెజిట్ నోటిపికేషన్ లోని అంశాలు గడువులోగా అమలయ్యే తేదీల వారీగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి పంపాలని ఆదేశించారు. ఈ నేపధ్యంలో రెండు బోర్డులు స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.