జీవో 69ను పునరుద్ధరించండి : పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు

జీవో 69ను పునరుద్ధరించండి : పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు

    ఇరిగేషన్​ మంత్రిని కోరిన ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు

పాలమూరు/మక్తల్, వెలుగు: కొడంగల్, నారాయణపేట, మక్తల్  నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు ఉమ్మడి ఏపీలో జారీ చేసిన జీవో 69ని పునరుద్ధరించాలని మహబూబ్​నగర్, నారాయణపేట, మక్తల్​, దేవకరద్ర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​రెడ్డి, పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్​రెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్​ రెడ్డి సోమవారం ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ జీవో ద్వారా నారాయణపేట–-కొడంగల్​ స్కీంను చేపట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని కోరారు. 2014లోనే ఈ స్కీముకు అనుమతులు వచ్చినా, గత బీఆర్ఎస్​ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఈ స్కీం ఏర్పాటుపై చర్చిస్తామని తెలిపారు. అనంతరం ఇన్​చార్జి మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.