హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తి సహకార సంఘం మదర్ డెయిరీ (నార్ముల్) హస్తం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఇవాళ ఎన్నికల రిజల్ట్‌లో ఆరు డైరెక్టర్లకు గాను ఆరు డైరెక్టర్లు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్ధులు విజయం సాధించారు. క్లీన్ స్వీప్ కావటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాడి రైతులు బాణాసంచా కాలుస్తూ సంబురాలను జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.
గెలుపొందిన డైరెక్టర్లను ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గెలుపు రైతుల విజయమని చెప్పారు. ప్రభుత్వం సహాకారంతో డెయిరీ ని అన్ని విధాలుగా డెపలఫ్మెంట్ చేయడానికి కృషి చేస్తామన్నారు. కొత్తగా గెలిచిన డైరెక్టర్లు రైతుల కోసం అంకితభావంతో వర్క్ చేయాలన్నారు. డెయిరీ లో నెలకొన్న సమస్యలపై త్వరలోనే మీటింగ్ పెట్టి పరిష్కరించేందుకు కృషి చేస్తమన్నారు. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నారు.