ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రభుత్వ స్థలాలను కాపాడుతాం..

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ

నిజామాబాద్, వెలుగు: ప్రభుత్వ స్థలాల పరిరక్షించేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ హెచ్చరించారు. స్థలాల పరిరక్షణ కోసం మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో కలెక్టరేట్‌‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నగరంలోని దుబ్బ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ధన్‌‌పాల్‌‌ మాట్లాడుతూ రాజధానిలో పాత సెక్రటరియేట్‌‌ కూల్చివేసినట్లు ఇక్కడ కూడా కూల్చివేయడం విడ్డూరంగా ఉందన్నారు. బిల్డింగ్‌‌లకు కాలపరిమితి ఉన్నా అభివృద్ధి పేరుతో కూల్చివేశారని ఆరోపించారు. అర్బన్‌‌లో ప్రభుత్వ స్థలాలను ప్రై‌‌‌‌వేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు. కూల్చివేసిన స్థలాల్లో ఏం నిర్మాణాలు చేపడుతారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌‌పై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలన్నారు.

కలెక్టర్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలే తప్ప అధికార పార్టీకి కొమ్ముకాయడం సరికాదన్నారు. నిర్మాణాలపై ఆఫీసర్లు గోప్యత పాటిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆదిలాబాద్ ఇన్‌‌చార్జి అల్జాపూర్ శ్రీనివాస్, లీడర్లు మోహన్‌‌రెడ్డి, లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, గోపిడి స్రవంతిరెడ్డి, పంచారెడ్డి లింగం , పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్, ఎర్రం సుధీర్, మాస్టర్ శంకర్, మెట్టు విజయ్, భరత్ భూషణ్, ఇప్పకాయల కిశోర్, బంటు రాము, ఇల్లెందుల ప్రభాకర్, రోషన్‌‌, పుట్ట వీరేందర్, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.

సీనియర్‌‌ లీడర్ల వల్లే కాంగ్రెస్‌కు నష్టం

డీసీసీ ప్రెసిడెంట్​ మానాల మోహన్‌‌‌‌రెడ్డి 

నిజామాబాద్, వెలుగు: సీనియర్‌‌‌‌‌‌‌‌ లీడర్ల తీరు వల్లే కాంగ్రెస్‌‌‌‌ నష్టపోతుందని, వారి మధ్య సయోధ్య లేకపోవడంతోనే రెండు సార్లు పార్టీ అధికారాన్ని దక్కించుకోలేకపోయిందని డీసీసీ మానాల మోహన్‌‌‌‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ భవన్‌‌‌‌లో మంగళవారం టీపీసీసీ ఉపాధ్యక్షుడు తహెర్‌‌‌‌‌‌‌‌ బీన్ హందాన్, ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌లో ప్రతీ నాయకుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని, అందుకే శతాబ్ద కాలానికి పైగా పార్టీ మనుగడలో ఉందన్నారు.

కానీ కొంతమంది స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని కొత్తగా ఏర్పాటు చేసిన పీసీసీ కమిటీ, డీసీసీ అధ్యక్షుల నియామాకంపై తప్పుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల పాటు పార్టీలో కీలక పదవులు అనుభవించి ఆ నాయకులు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ పటిష్టతకు కృషిచేయాలని హితవుపలికారు. జనవరి 26న భారత్ జోడో పాదయాత్ర ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని జిల్లాల్లో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.  

యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌‌‌‌యూఐ లీడర్లు పార్టీ తలపెట్టే ప్రతీ కార్యక్రమాన్ని సక్సెస్‌‌‌‌ చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గోపి, సీనియర్ నాయకులు అంతిరెడ్డి రాజిరెడ్డి, జావీద్ అక్రమ్, మహమ్మద్ ఈసా భాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జాహిద్ బీన్ హందాన్ పాల్గొన్నారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌‌‌‌రెడ్డి

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు రెడీగా ఉండాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌‌‌‌రెడ్డి సూచించారు. నిజామాబాద్‌‌, కామారెడ్డి జిల్లాల పదాధికారుల సమావేశం మంగళవారం జరిగింది. పార్టీ జిల్లా ప్రెసిడెంట్లు బస్వా లక్ష్మీనర్సయ్య, అరుణతార నేతృత్వంలో వేర్వేరుగా జరిగిన ఈ మీటింగ్స్‌‌లో ప్రేమేందర్‌‌‌‌రెడ్డి చీఫ్‌‌ గెస్ట్‌‌గా హాజరై మాట్లాడారు. పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయాలన్నారు.

పార్టీకి ఆయువు పట్టు కార్యకర్తలేనన్నారు. ప్రజలు బీఆర్ఎస్‌‌ పాలనపై విసిగిపోయి బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. కేంద్ర కమిటీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం జరిగే ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిజామాబాద్‌‌ మీటింగ్‌‌లో నాయకులు పల్లె గంగారెడ్డి, అల్జపూర్ శ్రీనివాస్, లోక భూపతిరెడ్డి, ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ, దినేశ్‌‌, మేకపాటి ప్రకాశ్‌‌రెడ్డి, కామారెడ్డిలో జిల్లా ఇన్‌‌చార్జి మహిపాల్‌‌రెడ్డి, స్టేట్ కార్యవర్గ మెంబర్ చిన్నరాజులు, లీడర్లు మురళీధర్​గౌడ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.  

రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం

డిచ్‌‌‌‌పల్లి, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తుందని ఆర్టీసీ చైర్మన్‌‌‌‌, రూరల్​ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌‌‌‌ చెప్పారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌‌‌‌లో 
మంగళవారం ఆయన క్రిస్టియన్లకు క్రిస్మస్‌‌‌‌ గిఫ్ట్‌‌‌‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిస్టియన్ల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. గత పాలకులు మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్‌‌‌‌గానే చూశారన్నారు.

కేసీఆర్​ మైనార్టీ పక్షపాతి అని అన్నారు. అనంతరం డిచ్‌‌‌‌పల్లి మండలానికి చెందిన 118 లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. 
కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఐడీసీఎంఎస్​ చైర్మన్‌‌‌‌ సాంబారి మోహన్, జడ్పీటీసీలు ఇందిర, కమల, సుమలత, ఎంపీపీ విమల, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ మండల ప్రెసిడెంట్లు శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, శ్రీనివాస్, మధుకర్‌‌‌‌‌‌‌‌రావు తదితరులు పాల్గొన్నారు. 

ప్రగతి భవన్‌‌ను ముట్టడిస్తాం

  మాజీ మంత్రి షబ్బీర్​అలీ

కామారెడ్డి, వెలుగు: పెండింగ్‌‌ ఫీజు రియింబర్స్‌‌మెంట్‌‌,  స్కాలర్ ​షిప్స్‌‌ రిలీజ్ చేయాలని, లేకుంటే ప్రగతి భవన్​ ముట్టడిస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఫీజు బకాయిలు రిలీజ్ చేయా లని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వీరికి మద్దతుగా షబ్బీర్​అలీ పాల్గొని మాట్లాడుతూ  మూడేళ్లుగా రాష్ట్రంలో స్కాలర్ షీప్స్, ఫీజు రియింబర్స్‌‌మెంట్‌‌ రిలీజ్​ చేయకపోవడం దారుణం అన్నారు.

స్టూడెంట్ల జీవితాలతో  కేసీఆర్ సర్కారు చెలగాటమాడుతోందని విమర్శించారు. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని స్టూడెంట్లు అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్​రావు, ఎన్ఎస్‌‌యూఐ జిల్లా ప్రెసిడెంట్ సందీప్, సీపీయూఎస్ఐ ప్రతినిధి కట్ల భూమన్న, బీడీఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్​ఆజాద్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్ అరుణ్ పాల్గొన్నారు.  

‘షకీల్ నోరు అదుపులో పెట్టుకో..’

బోధన్, వెలుగు: బోధన్ ఎమ్మెల్యే షకీల్ నోరును అదుపులో  పెట్టుకోవాలని బీజేపీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని మేడపాటి ప్రకాశ్‌రెడ్డి ఇంటి వద్ద ప్రెస్​మీట్​ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి సుధాకర్‌‌‌‌చారి, మండల అధ్యక్షుడు పోశెట్టి, సీనియర్ నాయకులు మేక సంతోష్, లచ్చప్ప మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ బీజేపీ నేతలుయెండల లక్ష్మీనారాయణ,  మేడపాటి ప్రకాశ్‌‌రెడ్డి, వడ్డి మోహన్‌‌రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు.  

షకీల్‌‌ కంటే తమకు ఎక్కువగా తిట్లు వస్తాయని హెచ్చరించారు. రాబోవు రోజుల్లో బోధన్​ ప్రజలు ఎమ్మెల్యేకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రెస్‌‌మీట్‌‌లో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి  ప్రవీణ్, టౌన్ ప్రధాన కార్యదర్శి వాసు, నాయకులు రాజన్న, గుంత  గంగాధర్, ముత్యాల హరికృష్ణ, గంగుల శ్రీకాంత్ పాల్గొన్నారు.