ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

లింగంపేట, వెలుగు: రెడ్​క్రాస్ సొసైటీ లింగంపేట శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన నిరుపేదలకు హైజినిక్ కిట్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ మండల అధ్యక్షుడు బొల్లు శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ కిట్‌‌‌‌లో టార్పాలిన్ కవర్లు, బ్లాంకెట్లు, వంట సామగ్రి ఉన్నాయని చెప్పారు. 

మండలంలోని ఎక్కపల్లి, లింగంపేట, పర్మల్ల, సురాయిపల్లి, ఒంటర్​పల్లి తండాల్లో  నిరుపేదలకు  అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్​క్రాస్ సొసైటీ ఎల్లారెడ్డి డివిజన్ చైర్మన్ సంగన్నగారి రవిగౌడ్, సర్పంచులు సతీశ్‌‌‌‌గౌడ్, రాజశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సభ్యులు వినోద్, రజనీకాంత్, ​లక్ష్మణ్‌‌‌‌గౌడ్, మధు, సాయిలు పాల్గొన్నారు.'

సమస్య చెప్పేందుకు వెళ్తే అరెస్టు చేస్తరా..?

  •     మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యే వరకు పోరాటం
  •     బీజేపీ నేత వెంకటరమణారెడ్డి

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి టౌన్ మాస్టర్ ప్లాన్‌‌‌‌తో నష్టపోతున్న రైతులు తమ సమస్యను మంత్రి హరీశ్‌‌‌‌రావుకు చెప్పేందుకు వస్తే అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలో పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్య వినే టైం మంత్రికి, ఎమ్మెల్యేలకు లేదా అని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని,  రైతులు చేస్తున్న పోరాటానికి బీజేపీ ప్రత్యక్ష్యంగానే మద్దతు తెలుపుతోందని, వారి ఆందోళనలో తమ  పార్టీ శ్రేణులు పాల్గొంటారని చెప్పారు. 

ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్‌‌‌‌‌‌‌‌తో పాటు కాంగ్రెస్ నేత షబ్బీర్​అలీ తీరుపై వెంకటరమణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజామెత్తారు. శనివారం జరిగే  రైతుల ఆందోళనలో దమ్ముంటే షబ్బీర్​అలీ పాల్గొనాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ తేలు శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్​ విపుల్ జైన్, ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, కౌన్సిలర్లు రవి, ప్రవీణ్‌‌‌‌, శ్రీనివాస్, నరేందర్, లీడర్లు భరత్, రమేశ్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.  

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది

 బీజేపీ నేత మేడపాటి ప్రశాశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి

బోధన్, వెలుగు: తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఆరాచక పాలన కొనసాగుతోందని బీజేపీ నేత మేడపాటి ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. గురువారం పట్టణంలోని రాకాసిపేట్‌‌‌‌‌‌‌‌లో గడప గడపకు బీజేపీ ప్రోగ్రామ్ కొనసాగింది. ముందుగా భీముని గుట్ట అయ్యప్ప టెంపుల్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక పూజలు చేసి ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. రాకాసిపేట్‌‌‌‌‌‌‌‌లోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర చేపట్టారు.  ఈ సందర్భంగా మేడపాటి మాట్లడుతూ సబ్బండ వర్గాలను మోసం చేస్తూ కేసీఆర్ కుటుంబం మాత్రమే రాజభోగాలు అనుభవిస్తోందని మండిపడ్డారు. 

కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటీ నేరవేర్చడంలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, అసమర్థ ధోరణిపై ప్రజలు మండిపడుతున్నారన్నారు. ఇక బోధన్ ఎమ్యెల్యే షకీల్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాబోవు ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం  చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డి మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బోధన్ టౌన్ ప్రెసిడెంట్ కొలిపాక బాలరాజ్, జిల్లా కార్యదర్శి సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చారి, నాయకులు అశోక్‌‌‌‌‌‌‌‌గౌడ్, రామరాజు, కమలాకర్, లచ్చప్ప, గుంత గంగాధర్ పాల్గొన్నారు. 

అన్ని మతాలకు సమ ప్రాధాన్యం   

 ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

ఆర్మూర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా గురువారం ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన వేడుకలకు ఎమ్మెల్యే హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే రంజాన్, క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు చర్చీల నిర్మాణానికి కఠిన నిబంధనలు ఉండేవని, తెలంగాణ వచ్చాక అన్ని ప్రార్థనా స్థలాల నిర్మాణానికి ఇచ్చినట్టే చర్చీలకు అనుమతు ఇస్తున్నట్లు చెప్పారు. 

ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రిస్టియన్ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది క్రిస్మస్ పండుగ నాటికి ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం పూర్తయ్యేలా పనులు వెంటనే షురూ చేయాలన్నారు. మామిడిపల్లిలో నిర్మించిన ఆర్మూర్ నియోజకవర్గ ఫాస్టర్స్ అసోసియేషన్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌కు అదనంగా రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ వేణుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, పూజ నరేందర్, రవి గౌడ్, పండిత్ ప్రేమ్ పాల్గొన్నారు.

కాలుష్య నియంత్రణ పర్మిషన్ తప్పనిసరి

కామారెడ్డి, వెలుగు: హాస్పిటల్స్‌‌‌‌కు కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకువాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. గురువారం ఆఫీసర్లతో జరిగిన మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ హాస్పిటల్స్ నుంచి వెలువడే బయో వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలోనే నిర్వీర్యం చేయాలన్నారు.  అడిషనల్ ఎస్పీ అన్యోన్య, పర్యావరణ ఇంజినీర్ లక్ష్మణ్‌‌‌‌ప్రసాద్, డీఎంహెచ్‌‌‌‌వో లక్ష్మణ్‌‌‌‌సింగ్, డీసీహెచ్‌‌‌‌వో విజయలక్ష్మి పాల్గొన్నారు.