న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు, యువతులు ఉదయం వాకిళ్లలో రంగు రంగుల ముగ్గులు వేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు రాశారు. ఈ ఏడాదంతా బాగుండేలా దీవించాలని ఆలయాలు, చర్చిలకు వెళ్లి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. దీంతో జిల్లా కేంద్రంలోని ఆలయాలు, చర్చిలు భక్తుల రద్దీతో సందడిగా మారాయి. - ఫొటోగ్రాఫర్, వెలుగు
స్టేట్ లెవల్ ర్యాంకులు సాధించాలిలింగంపేట, వెలుగు: గురుకులాల్లో చదువుతున్న ఇంటర్, టెన్త్ స్టూడెంట్లు స్టేట్ లెవల్ ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు, గురుకులానికి గుర్తింపు తేవాలని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఆదివారం ఆయన లింగంపేట, నాగిరెడ్డిపేట మండల కేంద్రాల్లోని కస్తూర్బా గురుకుల స్కూళ్లను విజిట్చేశారు. స్టూడెంట్లతో కలిసి న్యూ ఇయర్వేడుకలు జరుపుకున్నారు.
ఇంగ్లీష్‌పై పట్టు సాధించాలి
స్టూడెంట్లు ఆరోతరగతి నుంచే ఇంగ్లీష్‌పై పట్టు సాధించాలని ఎమ్మెల్యే స్టూడెంట్లకు సూచించారు. గ్రూప్ డిస్కషన్స్ స్టూడెంట్లలో ఇంగ్లీష్డెవలప్చేయాలని ప్రిన్సిపాల్ వాసంతికి సూచించారు. ఎంపీపీ గరీబున్నీసా, సర్పంచ్లావణ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే
పోచారం ప్రాజెక్టు నీటిని ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రాజెక్టు కింద సుమారు 7వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగుచేయనున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ రాజ్‌దాస్,జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తర తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
నిజామాబాద్‌రూరల్, వెలుగు: నగర శివారులోని గంగాస్థాన్ కాలనీలోని ఉత్తర తిరుపతి ఆలయం లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న అవదూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామిజీ వెంకటేశ్వరస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హాజరైన భక్తులకు వైకుంఠ ఏకాదశి విశిష్టతను వివరించారు. ప్రతి వ్యక్తి దైవ చింతనకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. సోమవారం వైకుంఠ ఏకాదశిని పుర స్కరించుకుని ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
51 డ్రంకెన్ డ్రైవ్కేసులు నమోదు
కామారెడ్డి, వెలుగు: జిల్లాలో న్యూ ఇయర్వేడుకల సందర్భంగా శనివారం అర్ధరాత్రి పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ చెకింగ్స్ చేశారు. తాగి వెహికల్స్ నడిపిన 51 మందిపై డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి డివిజన్లో19, ఎల్లారెడ్డి లో 15, బాన్స్వాడలో 17 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ బి. శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్త్ చేపట్టారు.
జిల్లాలో ‘30’ పోలీస్ యాక్ట్
జిల్లాలో ఈ నెలాఖరు వరకు ‘30 పోలీస్ యాక్ట్’ అమలు చేస్తున్నట్లు ఎస్పీ బి. శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ పర్మిషనల్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు, మీటింగ్‌లు నిర్వహించొద్దన్నారు.
సుజాతకు రక్షణ కల్పించాలి
నందిపేట, వెలుగు: శాపూర్గ్రామంలో 80 మందిని బహిష్కరించిన సంఘటనలో బాధితురాలైన సుజాతకు ఆఫీసర్లు అండగా ఉండాలని పౌరహక్కుల సంఘం, నిజ నిర్ధారణ బృందం సభ్యులు కోరారు. ఇటీవల గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి సహకరించారని ఎనగంటి సుజాత తో పాటు ఆమెకు సహకరించిన 80 మంది మున్నూరు కాపు సంఘ సభ్యులను వీడీసీ సభ్యులు సాంఘిక బహిష్కరణ చేయగా, ఆఫీసర్ల చొరవతో సద్దుమనిగిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం శాపూర్ గ్రామానికి పౌరహక్కుల నిజనిర్ధారణ బృంధం సభ్యులు వెళ్లి సుజాతను కలిసి వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భర్త లేని మహిళ కావడంతో గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆమె ఇంటి స్థలాన్ని వారికి అమ్మలేదన్న కక్షతో ఆమెను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఆఫీసర్లు చొరవతో సమస్య సద్దుమనిగినప్పటికీ, వారు మళ్లీ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని, అందుకే ఆఫీసర్లు ఆమె ఇంటి స్థలాన్ని దృవీకరించడంతో పాటు ఆ నలుగురు వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు మువ్వా నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కొంగర శ్రీనివాసరావు, జలంధర్, ప్రవీణ్‌కుమార్, రవీందర్ ఉన్నారు.
‘సబ్ కా సాత్, సబ్కా వికాస్’ బీజేపీ సిద్ధాంతం
కామారెడ్డి , వెలుగు: ‘సబ్కా సాత్ , సబ్కా వికాస్’ ఇదే బీజేపీ సిద్ధాంతమని కామారెడ్డి నియోజక వర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డిలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్‌లో వెంకటరమణా రె డ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ న్యాయం చేస్తుందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. మైనార్టీ మోర్చా లీడర్లు తదితరులు పాల్గొన్నారు.
బోధన్‌ను జిల్లా కేంద్రం చేయాల్సిందే
బోధన్, వెలుగు: మండలాన్ని జిల్లా కేంద్రం చే యాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట చేస్తున్న రిలే నిరాహార దీక్షలు14వ రోజుకు చేరాయి. ఆదివారం జేఏసీ లీడర్లు శివకుమార్, జునైద్ అహ్మద్, సచిన్ పటేల్, రాంచందర్, ఎత్తోండ రాజేందర్, అడ్వొకేట్లు అప్సర్ పాషా, శంకర్ దీక్షలో కూర్చున్నారు. వీరికి సీనియర్ అడ్వకేట్లు హన్మంత్‌రావ్, గంగారెడ్డి పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. జేఏసీ లీడర్లు మాట్లాడుతూ జిల్లా కేంద్రం ఏర్పాటుకు బోధన్‌కు అన్ని అర్హతలున్నాయని, జిల్లా ఏర్పాటు చేసే వరకు దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు.
రైల్వేస్టేషన్ ను పునరుద్ధరించాలని దీక్ష
ఎడపల్లి, వెలుగు: మూసేసిన రైల్వే స్టేషన్ ను పునరుద్ధరించాలని ఆదివారం ఎడపల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్షను చేపట్టారు. రైతు సంఘం అధ్యక్షుడు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ ఎడపల్లి రైల్వే స్టేషన్ పునరుద్ధరిస్తే మండలంలోని 10 గ్రామాల ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యం కలుగుతుందని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించాలని వారు డిమాండ్ చేశారు. పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.