ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిరికొండ, వెలుగు: రైతులు ఆయిల్ పామ్‌‌ సాగుపై దృష్టి పెట్టాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆఫీసర్ నర్సింగ్‌‌ దాస్ సూచించారు. మండలంలోని గడ్కోల్‌‌లో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు చేస్తే రైతులకు ఎకరానికి లక్ష వరకు ఆదా యం వస్తుందన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసిన భూమిలో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్లను కలవాలని సూచించారు.  ఫ్రీ యూనిక్ జిల్లా మేనేజర్ గంగాధర్, ఏవో జాడి వెంకటేశ్‌‌, సర్పంచ్ దేవగౌడ్, ఎంపీటీసీ గంగారాం తదితరులు పాల్గొన్నారు.

ప్రయోగాలతో బోధించాలి

బోధన్, వెలుగు: టీచర్లు ప్రయోగాలతో పాఠాలను బోధిస్తే విద్యార్థులకు ఎంతో అవగాహన కలుగుతుందని ఆర్డీవో రాజేశ్వర్ అన్నారు. మంగళవారం బోధన్ గర్నమెంట్ హైస్కూల్‌లో మండల స్థాయిలో టీచర్లకు ఎఫ్ఎల్‌ఎన్​( ఫండమెంట్ లెటరసీ అండ్ న్యూమరసీ), టీఎల్ఎం (టీచింగ్ అండ్ లర్నింగ్ మెటీరియల్) మేళా నిర్వహించారు. ఆర్డీవోతో పాటు మున్సిపల్​చైర్ పర్సన్ తూము పద్మావతి, మున్సిపల్​కమిషనర్​ఖమర్ హైమ్మద్, ఎంఈవో నాగనాథ్‌లో ప్రయోగాలను పరిశీలించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ ఒక్కొక్క  పాఠశాల నుంచి ఒక్కొకరమైన  ప్రయోగాలను తయారు చేయడం బాగుందన్నారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ నాగయ్య,    వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

హత్య కేసును ఛేదించిన పోలీసులు

బోధన్, వెలుగు: బోధన్ పట్టణ శివారు నర్సాపూర్ వద్ద జరిగిన చాట్ల శివకుమార్‌‌ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. మంగళవారం బోధన్‌ పీఎస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఏసీపీ కిరణ్‌కుమార్‌‌ ఈ కేసు వివరాలు వెల్లడించారు. మృతుడి తండ్రి చాట్ల గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోధన్ సీఐ ప్రేమ్‌కుమార్‌‌, ఏస్సైలు నవీన్, బాబురావు, కానిస్టేబుళ్లు మృతుడి సెల్​ఫోన్ ఆధారంగా విచారణ చేపట్టగా శక్కర్​నగర్‌‌కు చెందిన ఆర్.రుక్మిణితో పాటు కుమారుడు ఆర్.రంజిత్, అల్లుళ్లు పసికంటి అరుణ్, మానే శివకుమార్, దండి సునీల్ కలసి చాట్ల శివకుమార్‌‌ను నర్సాపూర్ శివారులో  విచక్షణ రహితంగా గొడ్డలితో నరికి చంపినట్లు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. 

రంజిత్ భార్యతో చాట్ల శివకుమార్​ సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో చంపినట్లు తెలిపారు. ఈనెల డిసెంబర్‌‌ 31న రాత్రి రుక్మిణి కుమారుడు రంజిత్, అల్లులు అరుణ్, శివకుమార్, సునీల్‌ కలసి దావత్ చేసుకుని డ్యాన్సులు చేసినట్లు తెలిపారు. ఆ రోజు రాత్రి మృతుడు చాట్ల శివకుమార్, రంజిత్ భార్యతో మాట్లాడుతుండగా వీరు చూసి హెచ్చరించినట్లు తెలిపారు. శివకుమార్‌‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుని ఈనెల 1న అర్థరాత్రి అతడిని కారులో నర్సపూర్ శివారు వైపు తీసుకెళ్లి గొడ్డలితో నరికి చంపారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీపీ తెలిపారు. ఒకే రోజులో కేసును ఛేదించిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు.  

బొలెరో ఢీకొని యువకుడి మృతి

పిట్లం, వెలుగు: అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న బొలెరో ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన బిచ్కుంద మండలం హస్గుల్‌లో జరిగింది. మంగళవారం గ్రామానికి చెందిన మహమ్మద్ అఫ్రోస్(24) దెగ్లూర్​ వెళ్లేందుకు హస్గుల్ బస్టాండ్​వద్ద నిలబడి ఉండగా బిచ్కుంద వైపు ఇసుకతో వెళ్తున్న బొలెరో మినీ ట్రక్కు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతడిని గ్రామస్తులు నిజామాబాద్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. అఫ్రోస్ మృతికి అక్రమ ఇసుక రవాణా కారణమని, బొలెరో డ్రైవర్‌‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. బిచ్కుంద పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చ జెప్పారు. మృతుడి బావ షేక్​ఇమ్రాన్​ఫిర్యాదు మేరకు కేసు ఫైల్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

స్టూడెంట్లు పొదుపు అలవాటు చేసుకోవాలి

బీర్కూర్​, వెలుగు: స్టూడెంట్లు పొదుపు అలవాటు చేసుకోవాలని బీర్కూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ క్రాంతికుమార్ సూచించారు. మంగళవారం బీర్కూర్ బీసీ గురుకులంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ పదేళ్ల పైబడిన స్టూడెంట్లు జీరో అకౌంట్‌‌ తీసుకోవచ్చన్నారు. స్కాలర్ షిప్స్‌‌లను ఈ అకౌంట్‌‌లో పొదుపు చేసుకోవచ్చన్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై స్టూడెంట్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాధవి, విద్యార్థులు, కళాజాత బృందం సభ్యులు పాల్గొన్నారు.బీర్కూర్​, వెలుగు: స్టూడెంట్లు పొదుపు అలవాటు చేసుకోవాలని బీర్కూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ క్రాంతికుమార్ సూచించారు. 

మంగళవారం బీర్కూర్ బీసీ గురుకులంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ పదేళ్ల పైబడిన స్టూడెంట్లు జీరో అకౌంట్‌‌ తీసుకోవచ్చన్నారు. స్కాలర్ షిప్స్‌‌లను ఈ అకౌంట్‌‌లో పొదుపు చేసుకోవచ్చన్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై స్టూడెంట్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాధవి, విద్యార్థులు, కళాజాత బృందం సభ్యులు పాల్గొన్నారు.