హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ లోని ఆర్టీఏ పరిధిలో ఈ ఏడాది 5,819 డ్రైవింగ్ లైసెన్స్ లు క్యాన్సిల్ చేశామని జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు. డ్రంకన్ డ్రైవ్, యాక్సిడెంట్ వంటి కేసుల్లో ఆ లైసెన్స్ లను రద్దు చేశామని ఆయన చెప్పారు. 2021 ఏడాదితో పోలిస్తే ఇది 3,220 అధికమని శనివారం ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు.
హైదరాబాద్ పరిధిలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ జోన్ లు ఉండగా ఈస్ట్ జోన్ మినహా మిగతా అన్ని జోన్లలో భారీగా లైసెన్స్ లను రద్దు చేశామన్నారు. నార్త్ జోన్ లో 1103, సౌత్ లో 1151, ఈస్ట్ లో 510, వెస్ట్ జోన్ లో 1345 డ్రైవింగ్ లైసెన్స్ లను క్యాన్సిల్ చేశామని వివరించారు.