మహబూబాబాద్/ ములుగు/ హసన్‌పర్తి/ తొర్రూరు/ ఖిలా వరంగల్, వెలుగు: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని పోలీసు ఉన్నతాధికారులు అన్నారు. సోమవారం ఉమ్మడి వరంగల్జిల్లా పోలీసుల అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్అమరుల స్థూపానికి నివాళులర్పించారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు.
అనంతరం అమరవీరుల కుటుంబాలను సన్మానించి, బహుమతులు అందజేశారు. హనుమకొండ జిల్లా భీమారంలోని శుభం కల్యాణవేదికలో ఎంజీఎం రక్తనిధి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వరంగల్సీపీ అంబర్కిషోర్ప్రారంభించారు. రక్తదానం చేసిన హనుమకొండ, కాజీపేట, కేయూసీ పీఎస్‌ల పరిధిలోని యువకులు, పోలీసులకు ఆయన సర్టిఫికెట్లు, పండ్లు, హెల్త్డ్రింక్స్అందజేశారు.
కార్యక్రమంలో సెంట్రల్జోన్డీసీపీ షేక్‌సలీమా, ఏసీపీ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్జిల్లా కేంద్రంలో ఎస్పీ సుధీర్రామ్నాథ్కేకన్, కలెక్టర్అద్వైత్కుమార్సింగ్ఏఎస్పీ చెన్నయ్య, డీఎస్పీ తిరుపతిరావు పాల్గొన్నారు. ములుగు హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ పి.శబరీశ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించగా, అడిషనల్ఎస్పీ సదానందం, డీఎస్పీలు రాములు, రవీందర్తదితరులు పాల్గొన్నారు. తొర్రూరులో సీఐ జగదీశ్ఆధ్వర్యంలో పట్టణంలో పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వరంగల్‌సిటీ మామునూర్పోలీసు శిక్షణ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపల్పూజ పాల్గొని అమరవీరుల త్యాగాలను వివరించారు.