WI vs PAK: లెక్క సరిచేశాడు: పాక్ స్పిన్నర్‌పై తొడ గొట్టి రివెంజ్ తీర్చుకున్న విండీస్ బౌలర్

WI vs PAK: లెక్క సరిచేశాడు: పాక్ స్పిన్నర్‌పై తొడ గొట్టి రివెంజ్ తీర్చుకున్న విండీస్ బౌలర్

క్రికెట్ లో రివెంజ్ ఆటగాళ్లకు భలే కిక్ ఇస్తాయి. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్, వెస్టిండీస్ ల మధ్య జరిగిన రెండో టెస్టులో అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పాకిస్థాన్ స్పిన్నర్ సాజిద్ ఖాన్, వెస్టిండీస్ స్పిన్నర్ వారికన్ జరిగిన మధ్య జరిగిన వార్ ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసింది. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సాజిద్ ఖాన్ బౌలింగ్ లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 36 పరుగులు చేసి పాకిస్థాన్ బౌలర్లను విసిగించిన వారికన్.. రెండో ఇన్నింగ్స్ లో భారీ షాట్ ఆడడంలో విఫలమై 7 పరుగులకే వెనుదిరిగాడు.   

వికెట్ తీసుకున్న తర్వాత వారికన్ కు నాలుగు వేళ్ళు చూపిస్తూ సాజిద్ ఖాన్ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. వికెట్ తీసుకున్నప్పుడల్లా సాజిద్ ఖాన్ కు ఇలా చేయడం అలవాటే. ఈ సమయంలో వారికన్ నవ్వుతూ స్పందించాడు. మూడో రోజు ఆటలో భాగంగా సాజిద్ ఖాన్ ను క్లీన్ బౌల్డ్ చేసి వారికన్ తన రివెంజ్ తీర్చుకున్నాడు. సాజిద్ చూస్తుండగానే తొడ గొట్టి పెవిలియన్ వైపు వేలు చూపించాడు. ప్రస్తుతం వారికన్ సెలెబ్రేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ లో మొత్తం 9 వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు.   

Also Read : 34 ఏళ్ళ తర్వాత పాకిస్థాన్ గడ్డపై టెస్ట్ గెలిచిన వెస్టిండీస్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే  ముల్తాన్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ 120 పరుగుల తేడాతో గెలిచింది. 254 పరుగుల లక్ష్యంతో ఓవర్ నైట్ స్కోర్ 4 వికెట్లను 76 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన పాకిస్థాన్ మరో 57 పరుగులు జోడించి చివరి ఆరు వికెట్లను కోల్పోయింది.మొదట బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 163 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్థాన్ తమ తొలి ఇన్నింగ్స్ లో 154 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో బ్రాత్‌వైట్ (52) హాఫ్ సెంచరీతో వెస్టిండీస్ 244 పరుగులకు ఆలౌట్ అయింది.