![Player of the Month: వరుణ్ చక్రవర్తిని ఓడించి ఐసీసీ అవార్డు గెలుచుకున్న విండీస్ స్పిన్నర్](https://static.v6velugu.com/uploads/2025/02/jomel-warrican-has-been-awarded-the-icc-mens-player-of-the-month-for-january-2025_R5UtJvB1EF.jpg)
వెస్టిండీస్ స్పిన్నర్ జోమెల్ వారికన్ జనవరి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. నామినీలుగా ఎంపికైన టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీని ఓడించి ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. "ఈ అవార్డు గెలుచుకోవడం గౌరవంగా ఉంది" అని అవార్డు గెలుచుకున్న తర్వాత వారికన్ తెలిపాడు. టెస్ట్ క్రికెట్ లో నా మొదటి లక్ష్యం 5 వికెట్లు పడగొట్టడమని.. నా ప్రదర్శనకు ఐసీసీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని విండీస్ స్పిన్నర్ తెలిపాడు.
జనవరిలో పాకిస్తాన్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్ తో రాణించాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో 10 వికెట్లు తీసుకున్న వారికన్.. బ్యాటింగ్ లోనూ రాణించి అజేయంగా 31 పరుగులు చేశాడు. రెండో టెస్టులో 11వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి విలువైన 36 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 9 వికెట్లు పడగొట్టి ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో 19 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. మరోవైపు భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ పై నాలుగు టీ20 మ్యాచ్ ల్లో 12 వికెట్లు పడగొట్టాడు.
Also Read :- ఇండియా-పాకిస్థాన్ సమరం..మ్యాచ్ అఫీషియల్స్‌ను ప్రకటించిన ఐసీసీ
మహిళల విభాగంలో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీకి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది. మూనీ వెస్టిండీస్‌కు చెందిన కరిష్మా రామ్‌హారక్, అండర్ 19 మహిళల టీ20 ప్రపంచ కప్ విజేత గొంగడి త్రిషలను ఓడించి ఈ అవార్డు గెలుచుకుంది. ఆస్ట్రేలియాకు ఇది వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ది మంత్. డిసెంబర్ నెలలో కూడా ఆస్ట్రేలియా ప్లేయర్ అన్నాబెల్ సదర్లాండ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది.