T20 World Cup 2024: వర్షం టైంలో ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్ల పిచ్చిచేష్టలు.. కోచ్ ఏం చెప్పాడు..

T20 World Cup 2024: వర్షం టైంలో ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్ల పిచ్చిచేష్టలు.. కోచ్ ఏం చెప్పాడు..

వరల్డ్ వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయంతో సెమీస్ లోకి అడుగు పెట్టింది. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై  థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మంగళవారం (జూన్ 25) హోరీహోరీగా సాగిన చివరి లీగ్ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి సెమీస్ కు చేరింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ ను తప్పకుండా అభినందించాల్సిందే. అయితే అంతక ముందు గెలుపు కోసం ఆఫ్గన్ చేసిన పని నవ్వు తెప్పిస్తుంది. మరోవైపు  విమర్శలకు దారి తీస్తుంది. 

116 పరుగుల లక్ష్య ఛేదనలో మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. ఈ దశలో ఇన్నింగ్స్ 12 ఓవర్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. మబ్బులు కమ్మి చినుకులు పడుతుండడంతో ఆఫ్గన్ ప్రధాన కోచ్ జోనాథన్ ట్రాట్ చేసిన ఒక పని వైరల్ అవుతుంది. అప్పటికే డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో రెండు పరుగులు ఆఫ్ఘనిస్తాన్ ముందుండడంతో  స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న నాయబ్ ను తిమ్మిర్లు వచ్చాయని కింద పడిపొమ్మని సంకేతమిచ్చాడు. దీంతో వెంటనే నాయబ్ అలానే చేశాడు. దీంతో కొద్ది సేపు గ్రౌండ్ లో డ్రామా చోటు చేసుకుంది.

ఈ దశలో వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఆఫ్ఘనిస్తాన్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించి ఉండేది. అయితే వర్షం వెంటనే తగ్గిపోవడంతో మళ్ళీ మ్యాచ్ కొనసాగింది. ఒక ఓవర్ తగ్గించి బంగ్లా టార్గెట్ ను 19 ఓవర్లో 114 పరుగులకు కుదించారు. గెలుపు కోసం ఇలా చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ కోచ్, ఆల్ రౌండర్ నాయబ్ పై విమర్శలు వస్తున్నాయి.కొంతమందైతే వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తప్పు లేదంటున్నారు. ఈ మ్యాచ్ లో చివరగా గెలిచినా.. వీరు క్రీడా స్ఫూర్తి మరిచారని కామెంట్స్ చేస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది.