వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ బోన్ కొట్టింది. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ని మట్టికరిపించడం ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ విజయం కూడా గాలివాటంగా వచ్చిందేమీ కాదు. మ్యాచ్ ఆధ్యంతం సమిష్టిగా పోరాడితేనే వచ్చింది. పటిష్టమైన ఇంగ్లాండ్ ని ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓడించడానికి అసలు కారణం తెలిసిపోయింది. అతడెవరో కాదు ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన కోచ్ జోనాథన్ ట్రాట్. ఇంతకీ ట్రాట్ ఎవరో.. ఆఫ్ఘనిస్తాన్ విజయానైకి ఎలా కారణమయ్యాడో ఇప్పుడు చూద్దాం.
"జోనాథన్ ట్రాట్" ఈ పేరుకు ఇప్పుడు పెద్దగా తెలియకపోవచ్చు గాని ఒక పదేళ్లు వెనక్కి వెళ్తే ఈ స్టార్ ప్లేయర్ అందరికీ పరిచయమే. ఇంగ్లాండ్ జట్టులో ప్రధాన బ్యాటర్ గా ఉంటూ నిలకడగా ఆడి జట్టుకి ఎన్నో విజయాలను అందించాడు. 2011 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకున్న ఈ స్టార్ బ్యాటర్.. కోచ్ బాధ్యతలు చేపట్టాడు. 2021 లో ఇంగ్లాండ్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ఇంగ్లీష్ జట్టుకు కోచ్ గా పని చేసాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ జట్టుకి కోచ్ గా మారిన ట్రాట్.. ఇంగ్లీష్ జట్టు పరాజయానికి కారణమయ్యాడు.
ఆఫ్ఘనిస్తాన్ జట్టుకి విజయం ఇంగ్లాండ్ పై అద్భుత విజయం సాధించినా.. దాని వెనుక కోచ్ ట్రాట్ పాత్ర ఎంతైనా ఉంది. ఇంగ్లాండ్ బ్యాటర్లకు స్పిన్ ఆడటంలో ఉన్న బలహీనతను తెలుసుకొని వారికి తగిన సూచనలు ఇచ్చి ఆఫ్ఘన్ జట్టుకి చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో తన వంతు పాత్రను పోషించాడు. ఈ మ్యాచుకు ముందు కూడా ఇంగ్లాండ్ కి సవాలు విసిరిన ట్రాట్.. అనుకున్నట్లుగానే వారిని దెబ్బ కొట్టాడు.మరి ట్రాట్ కోచింగ్ ఇంగ్లాండ్ మీదేనా లేకపోతే ఇతర జట్లపై కూడా పని చేస్తుందో చూడాలి.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (80; 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపులు మెరిపించగా.. మరో ఓపెనర్ ఇబ్రహీం జాడ్రన్ 28, ఇక్రం అలిఖిల్ 58, ముజీం ఉర్ రెహ్మాన్ 28 పరుగులు చేశారు.
285 పరుగుల ఛేదనలో బజ్‌బాల్ హీరోలు చతికిలపడ్డారు. హ్యారీ బ్రూక్ (66) మినహాఅందరూ చేతులెత్తేశారు. బెయిర్‌స్టో (2), మలాన్ (32), రూట్ (11), బట్లర్ (9), లివింగ్‌స్టోన్ (10), సామ్ కర్రన్ (10), వోక్స్ (9).. ఇలా ఒకరివెంట మరొకరు పెవిలియన్ చేరారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చిన ఇంగ్లాండ్.. 40.3 ఓవర్లలో 215 పరుగుల వద్ద తమ పోరాటన్ని ముగించింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ చెరో 3 వికెట్లతో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టారు.