RR vs GT: వద్దనుకున్నవాడు వస్తున్నాడు.. స్టార్ ప్లేయర్‌ను చూసి రాజస్థాన్‌కు బిగ్ టెన్షన్

RR vs GT: వద్దనుకున్నవాడు వస్తున్నాడు.. స్టార్ ప్లేయర్‌ను చూసి రాజస్థాన్‌కు బిగ్ టెన్షన్

ఐపీఎల్ 2025లో మరి కాసేపట్లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సోమవారం (ఏప్రిల్ 28) జైపూర్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో గుజరాత్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. గుజరాత్ టేబుల్ రెండో స్థానంలో ఉంటే..రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా కోల్పోయిన రాజస్థాన్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించిన గుజరాత్.. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ కు చేరువవుతుంది.

బలాబలాలు.. రికార్డుల సంగతి పక్కన పెడితే నేడు జరగబోయే మ్యాచ్ లో ఒక విషయం ఆసక్తికరంగా మారనుంది. అదేంటో కాదు గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన జోస్ బట్లర్ నేడు అదే జట్టుపై ప్రత్యర్థిగా ఆడుతుండడం విశేషం. కొన్ని సీజన్ లుగా రాజస్థాన్ జట్టు విజయాల్లో బ్యాటింగ్ భారాన్ని సింగిల్ హ్యాండ్ తో మోసిన బట్లర్ ను రాజస్థాన్  మెగా ఆక్షన్ కు ముందు రిటైన్ చేసుకోకుండా ఈ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కు బిగ్ షాక్ ఇచ్చింది. మెగా ఆక్షన్ లో ఈ ఇంగ్లాండ్ విధ్వంసకర ఆటగాడిని గుజరాత్ టైటాన్స్ రూ. 15.75 కోట్లకు సొంతం చేసుకుంది. 

ఈ టోర్నీలో తన బ్యాటింగ్ తో అదరగొట్టి రాజస్థాన్ ఫ్యాన్స్ కు బట్లర్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ తరపున మూడో స్థానంలో ఆడుతున్న బట్లర్.. తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారీ ఇన్నింగ్స్ లతో మ్యాచ్ విన్నర్ గా మారుతున్నాడు. ఒక వైపు గుజరాత్ వరుస విజయాలు సాధిస్తుంటే.. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ పరాజయాలతో ఢీలా పడిపోయింది. బట్లర్ లేకపోవడంతో ఓపెనింగ్ బలహీనంగా మారింది. ఇలాంటి సమయంలో బట్లర్ రాజస్థాన్ మీద చెలరేగితే ఆ జట్టు తట్టుకోవడం కష్టమే. జైపూర్ లో బట్లర్ కు ఒక సెంచరీ.. 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.