GT vs PBKS: పంజాబ్‌తో గుజరాత్ మ్యాచ్.. మిడిల్ ఆర్డర్‌లో బట్లర్.. ఓపెనర్‌గా శ్రేయాస్

GT vs PBKS: పంజాబ్‌తో గుజరాత్ మ్యాచ్.. మిడిల్ ఆర్డర్‌లో బట్లర్.. ఓపెనర్‌గా శ్రేయాస్

ఐపీఎల్ లో మంగళవారం (మార్చి 25) మరో ఆసక్తికర సమరం జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో గుజరాత్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఈ సీజన్ లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఇప్పటికే 8 జట్లు తమ తొలి మ్యాచ్ ను ఆడేశాయి. పంజాబ్ కి శ్రేయాస్ అయ్యర్ తొలిసారి కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇరు జట్లలో పవర్ హిట్టర్లు ఉండడంతో ఈ మ్యాచ్ అభిమానులకి కిక్ ఇవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. 

మిడిల్ ఆర్డర్ లో బట్లర్ సేవలు:

అంతర్జాతీయ టీ20 క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో బట్లర్ ఓపెనర్ గానే ఎక్కువగా బ్యాటింగ్ చేశాడు వన్డేల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసినా టీ20 మాత్రం బట్లర్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. అయితే ఇటీవలే భారత్ తో జరిగిన టీ20 సిరీస్ లో మాత్రం మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. దీంతో బట్లర్ ను గుజరాత్ టైటాన్స్ మిడిల్ ఆర్డర్ లో ఆడించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మ్యాచ్ కు ముందు కూడా గుజరాత్ కెప్టెన్ గిల్ బట్లర్ మిడిల్ ఆర్డర్ లో వస్తాడనే హింట్ ఇచ్చాడు. ఓపెనర్లుగా గిల్, సాయి సుదర్శన్ ఉండడంతో బట్లర్ మిడిల్ ఆర్డర్ లో వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

పంజాబ్ ఓపెనర్ గా శ్రేయాస్ అయ్యర్:

ప్రస్తుతం పంజాబ్ జట్టులో ఓపెనర్ గా ఎవరు బరిలోకి దిగుతారనే విషయంలో చర్చ జరుగుతుంది. ఒక ఓపెనర్ గా ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఉండగా.. మరో ఓపెనర్ ఎవరూ లేరు. ప్రియన్స్ ఆర్య ఉన్నప్పటికీ అతనికి ఐపీఎల్ ఆడిన అనుభవం లేదు. మరోవైపు సిమ్రాన్ సింగ్ కూడా యంగ్ ప్లేయరే కావడం విశేషం. దీంతో పంజాబ్ ఓపెనర్ గా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్ లో స్టోయినీస్, మ్యాక్స్ వెల్, నెహ్యాల్ వధేరా, శశాంక్ సింగ్ ఉండడంతో అయ్యర్ ఓపెనింగ్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు అయ్యర్ కు ఓపెనింగ్ చేసిన అనుభవం లేకపోయినా.. ప్రస్తుతం ఉన్న ఫామ్ లో ఓపెనింగ్ చేస్తే అదరగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. 

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 (అంచనా) :

శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్) , ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, నేహాల్ వాధేరా/సూర్యాంష్ షెగ్డే, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్ మరియు యుజ్వేంద్ర చాహల్,
    

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11 (అంచనా):

శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్