చాంపియన్స్‎ ట్రోఫీలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్సీకి బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై

చాంపియన్స్‎ ట్రోఫీలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్సీకి బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై

కరాచీ: చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండు పరాజయాలతో తమ జట్టు గ్రూప్ దశలోనే నిష్ర్కమించడంతో జోస్ బట్లర్ ఇంగ్లండ్ కెప్టెన్సీ వదులుకున్నాడు. శనివారం సౌతాఫ్రికాతో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చివరగా జట్టును నడిపిస్తానని తెలిపాడు. ‘నేను కెప్టెన్నీ నుంచి తప్పుకుంటున్నా. ఈ నిర్ణయం నాతో పాటు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచిదని భావిస్తున్నా. కోచ్​ మెకల్లమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి మరో వ్యక్తి ఈ బాధ్యత చేపట్టి జట్టును ముందుకు తీసుకెళ్తాడు’ అని బట్లర్ పేర్కొన్నాడు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తప్పుకున్నా ఆటగాడిగా కొనసాగుతానని స్పష్టం చేశాడు. 

జట్టుకు, తన కెప్టెన్సీకి చాంపియన్స్ ట్రోఫీ చాలా ముఖ్యమైనదన్న బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుసగా రెండు ఓటములతో టోర్నీ నుంచి నిష్ర్కమించడం, గత ఐసీసీ ఈవెంట్లలో ప్రతికూల ఫలితాల తర్వాత నాయకుడిగా తాను తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. దీన్ని సిగ్గుచేటుగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. ఇయాన్ మోర్గాన్ వారసుడిగా 2022 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు అందుకున్న బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2023లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జట్టుకు ట్రోఫీ అందించాడు. 

మరిన్ని వార్తలు