దేశానికే తొలి ప్రాధాన్యత.. సౌతాఫ్రికా టీ20 లీగ్ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్

దేశానికే తొలి ప్రాధాన్యత.. సౌతాఫ్రికా టీ20 లీగ్ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్

ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్, వికెట్ కీపర్-బ్యాటర్ జోస్ బట్లర్ 2025 లో జరగబోయే సౌతాఫ్రికా టీ20 లీగ్ నుంచి తప్పుకున్నాడు. మంగళవారం (ఆగస్టు 6) సోషల్ మీడియాలో తాను ఈ లీగ్ లో ఆడట్లేదని.. తనపై ప్రేమ చూపించిన అభిమానులకు తన కృతజ్ఞతలు తెలిపాడు. టోర్నమెంట్ ఆడలేనందుకు నిరాశ చెందానని.. భవిష్యత్తులో పార్ల్ రాయల్స్ తరపున ఆడతానని చెప్పుకొచ్చాడు. బట్లర్ సౌతాఫ్రికా లీగ్ లో పార్ల్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  

2025 సౌతాఫ్రికా టీ20 టోర్నమెంట్ జనవరి 9 నుండి ఫిబ్రవరి 8 వరకు జరుగుతుంది. ఇదే సమయంలో టీమిండియాతో ఇంగ్లాండ్ 5 టీ 20 మ్యాచ్ లు.. మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ పర్యటన కోసం ఇంగ్లాండ్.. భారత్ లో పర్యటించనుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఉండడంతో ఈ సిరీస్ ఇంగ్లాండ్ కు కీలకంగా మారనుంది. ఇంగ్లాండ్ వన్డే, టీ20 ఫార్మాట్ కు కెప్టెన్ గా బట్లర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

బట్లర్ సౌతాఫ్రికా టీ20 అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. 2023 సీజన్ లో 40.80 సగటుతో 408 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ రాయల్స్ తరపున ఆడుతున్న బట్లర్ కు  రాయల్స్ ఫ్రాంచైజీతో చాలా అనుబంధం ఉంది. బట్లర్ లేకపోయినా పార్ల్ రాయల్స్ బలంగానే కనిపిస్తుంది. తాజాగా ఈ జట్టులో టీమిండియా వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ చేరిన సంగతి తెలిసిందే. 

Also Read :- సెమీఫైనల్లో వినేశ్ ఫోగట్

పార్ల్ రాయల్స్ తాత్కాలిక జట్టు: 

డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్‌గిడి, జార్న్ ఫోర్టుయిన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, దినేష్ కార్తీక్, మిచెల్ వాన్ బ్యూరెన్, కోడి యూసుఫ్, కీత్ డడ్జియోన్, న్కాబా పీటర్, క్వేనా మఫాకా, లువాన్-డ్రే ప్రిటోరియస్

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)