సంజూ శాంసన్.. గత కొన్నేళ్లుగా సరైన అవకాశాలు లేక బెంచ్ కే పరిమితమవుతన్నాడు. కొన్ని కీలకమైన సిరీస్ లో ఈ కేరళ బ్యాటర్ ను అసలు పట్టించుకోలేదు. ఈక్రమంలోనే ఆసియా కప్, వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ లో అవకాశం రాలేదు. ఆసియా కప్ కోసం రిజర్వ్ ప్లేయర్ గా ఎంపికైన సంజూ.. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ స్క్వాడ్ లో స్థానం దక్కలేదు. అయితే సీనియర్లు రెస్ట్ తీసుకోవడంతో దక్షిణాఫ్రికా టూర్ కు సెలక్ట్ అయిన శాంసన్.. చివరి వన్డేలో సెంచరీ చేసి సత్తా చాటాడు.
శాంసన్ సెంచరీ చేయడంలో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా.. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ శాంసన్ ఇన్నింగ్స్ ను అభినదించడం వైరల్ గా మారింది. బట్లర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శాంసన్ ఆటను ప్రశంసించాడు. శాంసన్‌ను ట్యాగ్ చేసి హార్ట్ ఎమోజీని ఉంచాడు. బట్లర్, శాంసన్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశం వేరైనా.. వీరిద్దరి ఐపీఎల్ అనుబంధం కొనసాగుతూనే ఉంది. శాంసన్ కోసం బట్లర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇండియన్ ఫ్యాన్స్ బట్లర్ ను తెగ పొగిడేస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన మూడో వన్డేలో నెంబర్ 3 లో బ్యాటింగ్ చేసిన శాంసన్ ఎంతో పరిణితి చెందిన ఇన్నింగ్స్ ఆడాడు. 114 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108 పరుగులు చేసిన ఈ 29 ఏళ్ళ ఆటగాడు..తన కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న గిఫ్ట్ ను శాంసన్ ఇచ్చేశాడు. శాంసన్ తో పాటు తిలక్ తిలక్ వర్మ, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో మ్యాచ్ తో పాటు సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
Jos Buttler shares a story on Sanju Samson's historic maiden international century. pic.twitter.com/pBG1uqVLX5
— CricTracker (@Cricketracker) December 21, 2023